షూటింగ్‌లో మెట్ల మీద నుంచి జారిపడ్డ నాజర్
on Aug 18, 2022

హైదరాబాద్‌లో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్‌లో వెటరన్ యాక్టర్ నాజర్ గాయపడ్డారు. సుహాసిని మణిరత్నం, మెహ్రీన్ పిర్జాడా, సాయాజీ షిండే తదితరులతో పాటు తెలంగాణ పోలీస్ అకాడమీలో ఆయన షూటింగ్‌లో పాల్గొన్నారు. ఓ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు ప్రమాదవశాత్తూ ఆయన మెట్ల మీద నుంచి జారిపడటంతో గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగిన వెంటనే ఆయను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. అయితే ఆయన ఆరోగ్యం బాగానే ఉందనీ, ఆందోళన చెందాల్సిన పనిలేదనీ సమాచారం అందింది.
ఆయనకు తగిలిన దెబ్బ తీవ్రమైంది కాదనీ, కొద్దిగా రక్తస్రావం మాత్రం జరిగిందనీ తెలిసింది. త్వరలోనే ఆయనను హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేయనున్నారు. అయితే ఈ ఘటనపై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అయ్యింది.
దేశంలోని అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన నాజర్ తెరపై అనేక పాత్రలకు తన విలక్షణ నటనతో ప్రాణం పోశారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఆయన అగ్రశ్రేణి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. నటునిగా చాలా బిజీగా ఉంటూనే నడిగర్ సంగమ్‌కు అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



