ప్రకటన వచ్చి రెండేళ్ళు.. ఇంతవరకు ఫస్ట్ లుక్ రాలేదు!
on Aug 18, 2022

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఆదిపురుష్'. రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ పౌరాణిక చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. టీ సిరీస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రకటించి రెండేళ్లవుతున్నా ఇంతవరకు ఫస్ట్ లుక్ రాకపోవడం విశేషం.
'ఆదిపురుష్' సినిమాను సరిగ్గా రెండేళ్ల క్రితం 2020 ఆగస్టు 18న మేకర్స్ అనౌన్స్ చేశారు. 2021 ఫిబ్రవరిలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కాగా, కేవలం 103 రోజుల్లోనే మొత్తం చిత్రీకరణ పూర్తి చేసేశారు. వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు విడుదల తేదీ కూడా ప్రకటించారు.

'ఆదిపురుష్'ను అధికారికంగా ప్రకటించి రెండేళ్లు అయింది, చిత్రీకరణ కూడా ఎప్పుడో పూర్తయింది.. కానీ ఇంతవరకు ఫస్ట్ లుక్ విడుదల చేయకపోవడంపై ప్రభాస్ ఫ్యాన్స్ లో అసంతృప్తి ఉంది. 'ఆదిపురుష్' ప్రకటన వచ్చి రెండేళ్ళు అయిందంటూ ఓ వైపు ట్విట్టర్ లో సందడి చేస్తూనే.. మరోవైపు తమ అభిమాన హీరోని రాముడి రూపంలో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే ఉంది. ఆరోజు 'ఆదిపురుష్' ఫస్ట్ లుక్ విడుదలయ్యే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఈ అక్టోబర్ 23 తోనైనా ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు బ్రేక్ పడుతుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



