చిరుకి ఆ ముగ్గురు మరోసారి ప్లస్సవుతారా!?
on Feb 4, 2022
.webp)
చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న కథానాయకుల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. `ఆచార్య`, `గాడ్ ఫాదర్`, `మెగా 154`, `భోళా శంకర్`, `మెగా 156`.. ఇలా క్రేజీ లైనప్ తోనే సందడి చేయనున్నారు చిరు.
ఇదిలా ఉంటే.. రి-ఎంట్రీ బాట పట్టాక తనకు ఏ కథానాయికలైతే కలిసొచ్చారో వారితోనే మెగాస్టార్ మరోమారు జట్టుకట్టడం వార్తల్లో నిలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే.. `ఖైదీ నంబర్ 150`లో నాయికగా నటించిన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. చిరు తాజా చిత్రం `ఆచార్య`లో సందడి చేయనుంది. ఇక `సైరా.. నరసింహారెడ్డి` హీరోయిన్స్ అయిన లేడీ సూపర్ స్టార్ నయనతార, మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఇంకోసారి చిరుతో కలిసి నటిస్తున్నారు. `గాడ్ ఫాదర్`లో నయన్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తుండగా.. `భోళా శంకర్`లో చిరుకి జోడీగా దర్శనమివ్వనుంది తమన్నా. మరి.. చిరు బ్యాక్ టు బ్యాక్ హయ్యస్ట్ గ్రాసర్స్ `ఖైదీ నంబర్ 150`, `సైరా`కి స్పెషల్ ఎట్రాక్షన్స్ గా నిలిచిన కాజల్, నయనతార, తమన్నా.. రాబోయే `ఆచార్య`, `గాడ్ ఫాదర్`, `భోళా శంకర్`కి కూడా ప్లస్సవుతారేమో చూడాలి.
Also Read: 'రామారావు'తో చిందేయనున్న ఇలియానా!
కాగా, `ఆచార్య` ఏప్రిల్ 29న విడుదల కానుండగా.. `గాడ్ ఫాదర్`, `భోళా శంకర్` ఈ ఏడాది ద్వితీయార్ధంలో రిలీజయ్యే దిశగా నిర్మాణం జరుపుకుంటున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



