ఒకే ఒక్క హిట్.. శర్వానంద్ ఫ్లాప్ లకు బ్రేక్ పడేనా?
on Sep 4, 2022

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ యంగ్ హీరోలలో శర్వానంద్ ఒకడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 'అమ్మ చెప్పింది', 'గమ్యం', 'ప్రస్థానం', 'రన్ రాజా రన్', 'శతమానం భవతి' వంటి సినిమాలతో ఆకట్టుకున్న శర్వానంద్ ఐదేళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది వచ్చిన 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'తో డబుల్ హ్యాట్రిక్ ప్లాప్స్ అందుకున్న శర్వా త్వరలో 'ఒకే ఒక జీవితం' చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నాడు.
శర్వానంద్ చివరిసారిగా 2017లో విజయాన్ని అందుకున్నాడు. ఆ ఏడాది 'శతమానం భవతి', 'రాధ', 'మహానుభావుడు' సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన శర్వా.. 'రాధ'తో నిరాశపరిచినప్పటికీ మిగతా రెండు సినిమాలతో హిట్ కొట్టాడు. అప్పటి నుంచి ప్రతి ఏడాది కనీసం ఒక సినిమాను విడుదల చేస్తున్న ఈ యంగ్ హీరో విజయాన్ని మాత్రం అందుకోలేకపోతున్నాడు. 2018 లో 'పడి పడి లేచే మనసు', 2019 లో 'రణరంగం', 2020 లో 'జాను' సినిమాలు విడుదల కాగా ఇవేవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఇక 2021 లో శర్వా నటించిన 'శ్రీకారం', 'మహాసముద్రం' సినిమాలు విడుదలయ్యాయి. 'శ్రీకారం' సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది కానీ కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది. 'మహాసముద్రం' కూడా పరాజయంపాలైంది.
ఇక ఈ ఏడాది మార్చిలో విడుదలైన 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'తోనైనా శర్వా ప్లాప్ లకు బ్రేక్ పడుతుందేమో అనుకుంటే.. ఆ సినిమా కూడా ఘోర పరాజయం పాలై డబుల్ హ్యాట్రిక్ ప్లాప్ ని అందించింది. శర్వా నటించిన లేటెస్ట్ మూవీ 'ఒకే ఒక జీవితం' సెప్టెంబర్ 9న విడుదల కానుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీ కార్తీక్ దర్శకుడు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంది. మరి ఈ చిత్రమైన శర్వాకి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



