ఆమెతో రెండో పెళ్ళికి సిద్ధమైన మంచు మనోజ్!
on Sep 5, 2022

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ రెండో పెళ్ళికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రముఖ రాజకీయ నాయకుడు దివంగత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనికను ఆయన పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.
2015లో హైదరాబాద్ కు చెందిన ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్న మనోజ్ మనస్పర్థల కారణంగా 2019లో విడాకులు తీసుకున్నాడు. మౌనికరెడ్డికి కూడా గతంలో ఓ వ్యక్తితో వివాహం జరగ్గా కొంతకాలానికే విడిపోయారు. ఇక ఇప్పుడు మనోజ్, మౌనిక కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని సమాచారం.

ఇదిలా ఉంటే తాజాగా వీరిద్దరూ హైదరాబాద్ లోని ఓ గణేష్ మండపం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీరి పెళ్లి వార్తలకు ఇవి బలం చేకూర్చాయి. మరోవైపు మనోజ్ సైతం దీనిపై స్పందిస్తూ.. సందర్భం వచ్చినప్పుడు చెప్తానన్నాడు కానీ ఈ వార్తలు అవాస్తవమని ఖండించలేదు. దీంతో వీరి పెళ్లి దాదాపు ఖరారైనట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



