నాగ్, చైతూ.. హ్యాట్రిక్ కొడతారా!
on Dec 14, 2021

`నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మనవడు`, `కింగ్ నాగార్జున తనయుడు` అనే ట్యాగ్స్ తో ఎంట్రీ ఇచ్చినా.. అనతి కాలంలోనే నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు యువ సామ్రాట్ నాగచైతన్య. కాగా, తన తాత, తండ్రితో కలిసి `మనం` (2014)లో సందడి చేసిన చైతూ ఆ సినిమాతో తన కెరీర్ లో ఓ మెమరబుల్ హిట్ ని నమోదు చేసుకున్నాడు. ఆపై తను హీరోగా నటించిన `ప్రేమమ్` (2016)లో మరోసారి తన తండ్రి నాగ్ తో కాసేపు స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. నాన్న కాంబోలో మరో సక్సెస్ చూశాడు.
కట్ చేస్తే.. ఇప్పుడు `బంగార్రాజు` కోసం నాగ్ తో ముచ్చటగా మూడోసారి జట్టుకట్టాడు చైతూ. అంతేకాదు.. `మనం`లో నాగ్ కి గత జన్మలో తండ్రిగానూ, `ప్రేమమ్`లో నాగ్ కి తనయుడిగానూ కనిపించిన చైతూ.. `బంగార్రాజు`లో మనవడిగా కనిపించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. అదే గనుక నిజమైతే.. మూడు సార్లూ రక్త సంబంధీకులుగానే నాగ్, చైతూ నటించడం ఆసక్తికరమైన అంశమనే చెప్పాలి. మరి.. నాగ్ తో జట్టుకట్టిన గత రెండు సందర్భాల్లోనూ విజయాలు చూసిన చైతూ.. `బంగార్రాజు`తోనూ ఆ ఫీట్ ని రిపీట్ చేసి తన తండ్రి కాంబోలో హ్యాట్రిక్ కొడతాడేమో చూడాలి.
కాగా, కళ్యాణ్ కృష్ణ రూపొందిస్తున్న `బంగార్రాజు` సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో నాగ్ కి జంటగా రమ్యకృష్ణ, చైతూకి జోడీగా కృతి శెట్టి కనిపించనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



