'వార్-2' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. మామూలు షాక్ కాదిది..!
on Aug 9, 2025

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'వార్-2'. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. బిగ్ స్టార్స్ ఎన్టీఆర్, హృతిక్ కలిసి నటించిన సినిమా కావడంతో 'వార్-2'పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అయితే ఆ అంచనాలను పూర్తిస్థాయిలో అందుకోవడంలో టీజర్ విఫలమైంది. ట్రైలర్ కి మాత్రం పాజిటివ్ టాక్ వచ్చింది. 'సలాం అనాలి' సాంగ్ గ్లింప్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రచార చిత్రాలు ఎలా ఉన్నాయి అనేది పక్కన పెడితే.. సినిమా మాత్రం అదిరిపోయిందని ఇన్ సైడ్ టాక్. (War 2)
'వార్-2' సెన్సార్ పూర్తయింది. ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. సెన్సార్ రిపోర్ట్ తో పాటు, ఇండస్ట్రీ వర్గాల మాటలను బట్టి చూస్తే.. 'వార్-2' అవుట్ పుట్ అదిరిపోయిందని అర్థమవుతోంది. యాక్షన్, ఎమోషన్స్ ని మిళితం చేస్తూ సినిమాని నడిపించిన తీరు బాగుందట. ప్రేక్షకులకు థ్రిల్ పంచే అంశాలు ఇందులో ఎన్నో ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా యాక్షన్ ప్రియులకి బిగ్ ట్రీట్ లా సినిమా ఉంటుందని వినికిడి. మూడు యాక్షన్ సీక్వెన్స్ లు అదిరిపోయాయట. క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. ఇక ఎన్టీఆర్, హృతిక్ కలిసి చెందిసేన 'సలాం అనాలి' సాంగ్ ఐ ఫీస్ట్ అనే మాట వినిపిస్తోంది.
ఎన్టీఆర్, హృతిక్ నటించడంతో 'వార్-2'కి భారీ ఓపెనింగ్స్ వస్తాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన బాలీవుడ్ ఫిల్మ్ గా నిలిచినా ఆశ్చర్యంలేదని ట్రేడ్ వర్గాల మాట. ఇక సినిమా అవుట్ పుట్ గురించి వినిపిస్తున్న మాటలు నిజమై.. రిలీజ్ అయ్యాక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే.. వసూళ్లు పరంగా 'వార్-2' సంచలనాలు సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



