మహేష్ బాబు హాలీవుడ్ కి వెళ్తున్నాడా..?
on Aug 9, 2025

'బాహుబలి'తో ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చాడు దర్శకధీరుడు రాజమౌళి. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలు పాన్ ఇండియా స్టార్లుగా గుర్తింపు పొందారు. ఇక ఇప్పుడు మహేష్ బాబు వంతు వచ్చింది. అయితే మహేష్ పాన్ ఇండియా స్టార్ కాదు.. ఏకంగా పాన్ వరల్డ్ స్టార్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. (Mahesh Babu)
మహేష్ బాబుని చూడగానే బాలీవుడ్, హాలీవుడ్ హీరోల్లా ఉన్నాడని అంటుంటారు. కానీ, మహేష్ ఇప్పటివరకు ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. రీజినల్ సినిమాలతోనే రికార్డులు సృష్టించాడు, సూపర్ స్టార్ గా ఎదిగాడు. అలాంటి మహేష్.. మొదటిసారి రాజమౌళితో చేతులు కలిపాడు.
మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జెట్ మూవీ ఒకటి రూపొందుతోంది. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' చిత్రాలతో ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో.. ఇప్పటికే దీనిపై గ్లోబల్ ఆడియన్స్ దృష్టి ఉంది.
భారతీయ పురాణాలను ముడిపెడుతూ గ్లోబల్ ఆడియన్స్ మెచ్చే ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ ను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. కలెక్షన్స్ పరంగా ఈ మూవీ లెక్క రూ.2000 కోట్ల నుంచి మొదలవుతుందనే అంచనాలు ఉన్నాయి.
వసూళ్ళ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాతో మహేష్ బాబు రేంజ్ మారిపోయే అవకాశముంది. హీరోలను రాజమౌళి చూపించే విధానం బాగుంటుంది. అలాంటిది ఇప్పుడు మహేష్ లాంటి హ్యాండ్సమ్ హంక్ దొరికాడు. ఇక మహేష్ ని ఏ రేంజ్ లో చూపిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.
మహేష్ లుక్ కి, సెటిల్డ్ పర్ఫామెన్స్ కి గ్లోబల్ ఆడియన్స్ ఎట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే జరిగితే హాలీవుడ్ అవకాశాలు మహేష్ కోసం క్యూ కట్టినా ఆశ్చర్యంలేదు. మరి భవిష్యత్ లో మన సూపర్ స్టార్ హాలీవుడ్ కి వెళ్తాడో.. లేక ఇక్కడి నుంచే గ్లోబల్ లెవల్ లో సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



