హీరోగా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా వినాయక్ కొత్త సినిమా!
on Sep 19, 2022

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'ఆది' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వీవీ వినాయక్ మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకొని ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత 'దిల్', 'ఠాగూర్', 'బన్నీ', 'లక్ష్మి', 'కృష్ణ', 'అదుర్స్' ఇలా ఎన్నో సూపర్ హిట్స్ తో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. అయితే కొంతకాలంగా దర్శకుడిగా వినాయక్ స్పీడ్ తగ్గింది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో 'ఛత్రపతి' హిందీ రీమేక్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే త్వరలోనే ఆయన తెలుగులో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇంతకాలం తన దర్శకత్వ ప్రతిభ చూపించిన వినాయక్ ఇకనుంచి నటుడిగానూ అలరించడానికి సిద్ధమవుతున్నాడు. నిజానికి దిల్ రాజు నిర్మాణంలో వినాయక్ హీరోగా 'శీనయ్య' అనే మూవీ మొదలై కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. అయితే ఇప్పుడు తానే హీరోగా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా వినాయక్ ఓ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ అధికారిక ప్రకటన రానుందని, వచ్చే నెల ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.
వినాయక్ దర్శకత్వంలో వచ్చిన 'లక్ష్మి', 'కృష్ణ', 'నాయక్' వంటి హిట్ సినిమాలకు స్టోరీ, డైలాగ్స్ అందించిన ఆకుల శివ.. ఈ చిత్రానికి కూడా కథ, మాటలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. మరి తానే నటిస్తూ, నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో వినాయక్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



