సూపర్ స్టార్ కు గుండె దడ
on May 2, 2014
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా 3D చిత్రం "విక్రమసింహ". ఈ చిత్రం విడుదల వాయిదా పడిందని గతకొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై రజినీకాంత్ భార్య లత రజినీకాంత్ స్పందిస్తూ..."అవన్నీ వట్టి గాలి వార్తలే. అనుకున్నట్టుగానే ఈనెల 9న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతోంది. ఎన్ని సినిమాలు చేసిన కుడా ఇప్పటికీ తను నటించిన కొత్త సినిమా విడుదల అవుతుందంటే ఆయనకు(రజినీకాంత్) గుండె దడే! సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందోనని ఇప్పటికీ ఆందోళన చెందుతారు. ఈ సినిమా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగిస్తూ, భారతీయ సినీసీమలో చరిత్రాత్మకంగా నిలిచే సినిమాగా అవుతుంది. ఏకకాలంలో ఆరు భాషల్లో విడుదలవుతోంది. సౌందర్య చాలా బాగా తీసింది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది." అని అన్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
