ఎంత ఎదిగినా నేను మీ వాడినే!
on Aug 16, 2022

ఏ హీరోకి సాధ్యం కాని విధంగా అతికొద్ది సమయంలోనే సూపర్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఇంతవరకు ఆయన నటించిన ఒక్క హిందీ సినిమా కానీ, పాన్ ఇండియా మూవీ కానీ విడుదల కాకుండానే నార్త్ లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.
విజయ్ నటించిన మొదటి పాన్ ఇండియా ఫిలిం 'లైగర్' ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న విజయ్ ని చూసేందుకు నార్త్ ఆడియన్స్ ఎగబడుతున్నారు. విడుదలకు ముందే ఇంతటి క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్.. 'లైగర్' తర్వాత ఏ స్థాయికి వెళ్తాడోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే తాను ఎంత ఎదిగినా, ఏ స్థాయికి వెళ్లినా ఎప్పటికీ మీ(తెలుగు) వాడినేనని విజయ్ అంటున్నాడు.
తాజాగా హైదరాబాద్ లో జరిగిన 'లైగర్' ప్రెస్ మీట్ లో విజయ్ ను ప్రశ్నలు అడిగేందుక ఓ పాత్రికేయుడు ఇబ్బంది పడ్డాడు. "మీరు పాన్ ఇండియా స్టార్ అయ్యారు కాబట్టి ఫ్రీగా ప్రశ్నలు అడగలేకపోతున్నాను" అన్నాడు. దానికి విజయ్ స్పందిస్తూ.. "అదేం లేదు ఫ్రీగా అడగండి.. ఎలాంటి సందేహాలు వద్దు" అంటూ ముందున్న టేబుల్ మీద కాలు పెట్టి "ఇలా దర్జాగా అడగండి.. నేను ఎంత ఎదిగినా మీ వాడినే" అని అన్నాడు. విజయ్ ఇచ్చిన సమాధానం పట్ల ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



