ఫోన్ చేస్తే..మా అమ్మ పెళ్లి గురించే అడుగుతుంది
on Jul 23, 2023

బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడైన తెలుగు నటుడు విజయ్ వర్మ ఈ మధ్య వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అందుకు కారణం.. మిల్కీ బ్యూటీ తమన్నాతో తను నడిపిన లవ్ ట్రాక్ కారణం. `లస్ట్ స్టోరీస్ 2` వెబ్ సిరీస్ చేస్తున్న సమయంలో విజయ్ వర్మ, తమన్నా మధ్య లవ్ పుట్టింది. ఇద్దరూ పీకల లోతు ప్రేమలో ఉన్నారు. దాన్ని వారేం దాచుకోలేదు. ఓపెన్‌గా తమ ప్రేమ వ్యవహారాన్ని ఒప్పుకున్నారు. కానీ పెళ్లి గురించి మాత్రం వాళ్లు నోళ్లు తెరవలేదు. తాజాగా విజయ్ వర్మ తన పెళ్లికి సంబంధించి మరోసారి స్పందించారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
``నేను మా అమ్మగారికి ఫోన్ చేసిన ప్రతీసారి ఆమె నా పెళ్లి గురించి అడుగుతుంది. పెళ్లెప్పుడు చేసుకుంటావనే ప్రశ్నను నేను ఆమె నుంచి తరుచుగా వినాల్సి వస్తుంది. అందుకు కారణం లేకపోలేదు. ఎందుకంటే మా కమ్యూనిటీలో 16 ఏళ్లకే అబ్బాయిలకు పెళ్లి చేస్తారు. కాబట్టి నా కుటుంబం వైపు నుంచి ఒత్తిడి ఉండటం ఖాయం. మా అమ్మ నా పెళ్లి గురించి ప్రశ్నించినప్పుడంతా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటూ ఉంటాను. అందుకు కారణం ఇప్పుడు నా కెరీర్ సాఫీగా సాగిపోతుంది. ప్రస్తుతం నా కెరీర్‌పైనే దృష్టి పెట్టాను`` అన్నారు విజయ్ వర్మ. మరి ఈ యాక్టర్ తల్లి కోరికను ఎప్పుడు నేరవేరుస్తాడో మరి చూడాలిక.
విజయ్ వర్మ తెలంగాణకి చెందిన కుర్రాడు. కానీ బాలీవుడ్‌లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. తెలుగులోనూ నాని హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఎంసీఏ సినిమాలోనూ విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. కానీ తమన్నాతో ప్రేమలో పడ్డ తర్వాత విజయ్ వర్మపై మీడియా కాన్‌సన్‌ట్రేషన్ పెరిగింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



