మేం విడిపోలేదు కలిసే ఉన్నామంటున్న రాజీవ్ కనకాల!
on Jul 23, 2023

రాజీవ్ కనకాల.. తెలుగు సినిమా ప్రేక్షకులకు బాగా తెలిసిన వ్యక్తి. రాజీవ్ చాలా సినిమాలల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నెగెటివ్ రోల్స్, పాజిటివ్ రోల్స్ అని తేడా లేకుండా అన్నింటిలో నటించి, అందరిని తన నటనతో మెప్పించాడు. రీసెంట్ గా వచ్చిన లవ్ స్టోరీ మూవీతో తన లో ఉన్న మరొక కోణాన్ని బయటకు తీశారు రాజీవ్. రీసెంట్ గా వచ్చిన విరుపాక్షలో నటించాడు. కాగా రాజీవ్, స్టార్ యాంకర్ సుమ భార్యాభర్తలన్న విషయం తెలిసిందే.
కేరళకు చెందిన సుమ మాతృ భాష తెలుగు కానప్పటికి, తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు. ఆమె తెలుగు భాషను ఎంతో చక్కగా మాట్లాడడమే కాదు.. తన యాంకరింగ్ తో అందరిని ఆకట్టుకుంటుంది. చక్కటి వ్యాఖ్యానం, చిరునవ్వు, సమయస్ఫూర్తితో ఈమె యాంకరింగ్ రంగంలో రాణిస్తుంది. తెలుగు, మలయాళంలతో పాటు హిందీ, ఆంగ్ల భాషలలోను మాట్లాడగలదు. పంచావతారం, స్టార్ మహిళ, భలే ఛాన్సులే షోస్ తో మంచి పాపులరీటి తెచ్చుకుంది. ఏ ఆడియో ఫంక్షన్ అయిన సరే సుమ యాంకరింగ్ చెయ్యాలిసిందే.
టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ గా రాజీవ్- సుమలని చెప్పుకుంటారు. వాళ్లకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇన్ని సంవత్సరాలైనా వారి మధ్య ఎప్పుడు విబేధాలు వచ్చి వార్తలో నిల్చింది లేదు. అయితే ఈమధ్య సుమ, రాజీవ్ విడాకులు తీసుకున్నట్లు వేరుగా ఉంటున్నట్లు ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, తాజాగా రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. తాము విడిపోలేదని, కలిసే ఉన్నామని, ఎందుకు ఎవరో ఒకరు అలా రాస్తున్నారు, అలా చూసినప్పుడు నాకు కోపం వస్తుంది కానీ సుమ అవన్నీ పట్టించుకోదు. అలాంటి వాళ్ళ కోసం అప్పుడప్పుడు కలిసి వీడియోస్ చేస్తున్నాం. కలిసి షోస్ లో పార్టిసిపేట్ చేస్తున్నామని రాజీవ్ కనకాల ఫేక్ న్యూస్ కి ఫుల్ స్టాప్ పెట్టాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



