'ఎన్టీఆర్ కి ఆస్కార్'పై విజయ్ దేవరకొండ రియాక్షన్
on Aug 20, 2022

జూనియర్ ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడని, ఆస్కార్ బరిలో నిలిచే అర్హత ఉందని హాలీవుడ్ మీడియాలో సైతం కథనాలు వస్తున్నాయి. ఆస్కార్ నామినేషన్ లభిస్తే మన దేశానికి గర్వకారణమని పలువురు సెలబ్రిటీలు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇక తాజాగా విజయ్ దేవరకొండ కూడా తారక్ అన్న ఆస్కార్ గెలిస్తే అంతకన్నా కావాల్సింది లేదని అన్నాడు.
విజయ్ హీరోగా నటించిన 'లైగర్' మూవీ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న 'ఎన్టీఆర్ కి ఆస్కార్' అనే అంశంపై విజయ్ స్పందించాడు. "నేను ఆయన అవార్డు గెలవాలని కోరుకుంటున్నాను. తారక్ అన్న గెలిస్తే మామూలుగా ఉండదు" అని విజయ్ అన్నాడు. "మన కంట్రీ నుంచి మనోళ్లు గెలిస్తే ఆ హై వేరు. మనం గెలవగలమని నేను నమ్ముతున్నాను. సినిమాలో ఆయన అద్భుతంగా నటించాడు. చరణ్ అన్న, తారక్ అన్న ఇద్దరూ కిల్లర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు." అని విజయ్ ప్రశంసించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



