రూ.50 కోట్ల క్లబ్ లో 'కార్తికేయ-2'!
on Aug 20, 2022

బాక్సాఫీస్ దగ్గర 'కార్తికేయ-2' సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. వారం రోజుల్లోనే ఈ సినిమా రూ.50 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. ఫుల్ రన్ లో ఈ మూవీ కనీసం రూ.75 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశముందని అంటున్నారు.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రూ.11.30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన 'కార్తికేయ-2'.. మొదటి రోజు రూ.3.50 కోట్ల షేర్, రెండో రోజు రూ.3.81 కోట్ల షేర్, మూడో రోజు రూ.4.23 కోట్ల షేర్, నాలుగో రోజు రూ.2.17 కోట్ల షేర్, ఐదో రోజు రూ.1.61 కోట్ల షేర్, ఆరో రోజు రూ.1.34 కోట్ల షేర్, ఏడో రోజు రూ.2.03 కోట్ల షేర్ రాబట్టింది. ఏడు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.18.69 కోట్ల షేర్(29.55 కోట్ల గ్రాస్)తో సత్తా చాటింది. వారం రోజుల్లో నైజాంలో రూ.7.02 కోట్ల షేర్(బిజినెస్ 3.50 కోట్లు), సీడెడ్ లో రూ.2.91 కోట్ల షేర్(బిజినెస్ 1.80 కోట్లు), ఆంధ్రాలో రూ.8.76 కోట్ల షేర్(బిజినెస్ 6 కోట్లు) వసూలు చేసింది.
నార్త్ ఇండియాలో 4.45 కోట్ల షేర్, కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా 1.64 కోట్ల షేర్, ఓవర్సీస్ 3.25 కోట్ల షేర్ కలిపి.. వరల్డ్ వైడ్ గా ఏడు రోజుల్లో రూ.28.03 కోట్ల షేర్(50.55 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా 12.80 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ.. వారం రోజుల్లోనే బయ్యర్లకు దాదాపు రూ.15 కోట్ల లాభాలు తీసుకురావడం విశేషం. ఫుల్ రన్ లో ఈ చిత్రం రూ.40 కోట్ల షేర్ రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



