రియలిస్టిక్ గా `ఫలక్ నుమా దాస్` ట్రైలర్!!
on May 14, 2019

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన `ఈ నగారినికి ఏమైంది` సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న విశ్వక్సేన్ లేటెస్ట్ గా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం `ఫలన్ నుమా దాస్`. టీజర్ లో బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ సోమవారం విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా లాంచ్ అయింది. ట్రైలర్ చాలా రియలిస్టిక్ గా ఉంటూ పాతబస్తీలోని వాడుక భాషతో చాలా సహజంగా చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. పాతబస్తీకి చెందిన గ్యాంగ్ వార్స్, లవ్ స్టోరీలు, ప్రేమ గొడవలు సినిమా కాన్సెప్ట్ గా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్ చాలా డిఫరెంట్ గా ఉంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కాకుంటే ఈ ట్రైలర్ లో చాలా బూతులు వినిపించినా, ట్రైలర్ మాత్రం పాతబస్తీ బ్యాక్ డ్రాప్ కి తగ్గట్టుగా అనిపించింది. ఇందులో కీలకపాత్రలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో దర్శకుడు తరుణ్ భాస్కర్ నటించాడు. ఈ చిత్రానికి సురేష్ ప్రొడక్షన్ వారు సమర్పకులు గా వ్యవహరించడంతో బిజినెస్ పరంగా ఇప్పటికే సినిమాకు మంచి బజ్ వచ్చింది. త్వరలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



