స్విట్జర్లాండ్‌లో అల్లు అర్జున్...
on May 14, 2019

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? స్విట్జర్లాండ్‌లో! అక్కడ ఏం చేస్తున్నారు? సమ్మర్ కదా... అందుకని ఫ్యామిలీతో కలిసి ట్రిప్ వేశారు. స్విట్జర్లాండ్ మంచు కొండల్లో విహరిస్తున్నారు. అల్లు అర్జున్, ఆయన సతీమణి స్నేహారెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో హాలిడే ట్రిప్ ఫొటోలను పంచుకున్నారు. ఇవి చూస్తుంటే పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు అర్థమవుతోంది. సినిమాల విషయానికి వస్తే... త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రస్తుతం అల్లు అర్జున్ ఓ సినిమా చేస్తున్నారు. ఇది కాకుండా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో మరో సినిమా 'ఐకాన్ కనబడుటలేదు' అంగీకరించారు. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' తరవాత దాదాపు ఏడాది విరామం తీసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు ఒకేసారి మూడు సినిమాలను లైనులో పెట్టారు. జోరు పెంచారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



