ప్రముఖ నటి బి. సరోజాదేవి కన్నుమూత!
on Jul 14, 2025

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణ వార్త మరువక ముందే.. ప్రముఖ నటి బి. సరోజాదేవి మరణ వార్త వినాల్సి వచ్చింది. (B Saroja Devi)
ప్రముఖ నటి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత బి. సరోజాదేవి (87) కున్నుముశారు. బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1942 లో జన్మించిన ఆమె.. 13 ఏళ్ళ వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1955లో 'మహాకవి కాళిదాస' అనే కన్నడ సినిమాతో పరిచయమైన సరోజాదేవి.. ఇంటికి దీపం ఇల్లాలే, మంచి చెడు, దాగుడు మూతలు, పండంటి కాపురం, దాన వీర శూర కర్ణ వంటి తెలుగు సినిమాల్లో నటించారు. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో నటించిన సరోజాదేవి.. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, దిలీప్ కుమార్ వంటి దిగ్గజ నటులతో తెరను పంచుకున్నారు.
100 సినిమాలకు పైగా నటించి మంచి స్థాయిలో ఉండగా సరోజాదేవికి శ్రీహర్ష అనే వ్యాపారవేత్తతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుర్లు భువనేశ్వరి, ఇందిరా పరమేశ్వరి, ఒక కొడుకు గౌతం రామచంద్ర. భర్త శ్రీహర్ష మరణించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



