మహారాష్ట్రకు వెంకీమామ!
on Feb 6, 2019

మహారాష్ట్రకు వెళ్లడానికి 'వెంకీ మామ' & అల్లుడు డిసైడ్ అయ్యారు. మామాఅల్లుళ్లు విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న 'వెంకీ మామ' సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఈ నెల 22న మహారాష్ట్రలో హిల్ స్టేషన్ లోనావాలాలో ప్రారంభం కానుంది. ఇందులో హీరోలు ఇద్దరూ పాల్గొంటారని సమాచారం. ఈ నెల 27 వరకూ అక్కడే షూటింగ్ జరుగుతుందని తెలిసింది. తరవాత మర్చి 1వ తేదీ నుండి రాజమండ్రిలో కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. నాగచైతన్య 'ప్రేమమ్' సినిమాలో వెంకటేష్ అతిథి పాత్రలో నటించారు. మామాఅల్లుళ్లు కలిసి నటిస్తున్న మొదటి సినిమా కావడంతో దగ్గుబాటి, అక్కినేని అభిమానుల్లో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. 'జై లవ కుశ' విజయం తరవాత కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో వెంకటేష్ సరసన శ్రియ, నాగచైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. వినోదాత్మకంగా చిత్రంగా 'వెంకీ మామ'ను తెరకెక్కిస్తారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



