ఆ దర్శకుడికి రౌడి హీరో గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా??
on Jan 28, 2019

`తొలి ప్రేమ` చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన వెంకి అట్లూరి తాజాగా మిస్టర్ మజ్ను చిత్రాన్ని డైరక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇటీవల విడుదలై మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ దర్శకుడు వెంకి తన మూడో సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ బేనర్ లో ఓ చిత్రానికి కమిటయ్యాడు. కానీ హీరో ఎవరన్నది తెలియరాలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కు ఓ స్టోరి లైన్ చెప్పడానికి వెంకీ అట్లూరి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్టోరి లైన్ విని, ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. అయితే ఇటీవల మిస్టర్ మజ్ను చిత్రం పెద్ద గా పేరు తెచ్చుకోలేదు. మరి ఈ నేపథ్యంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ డైరక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ మైత్రి మూవీ మేకర్స్ బేనర్ లోనే `డియర్ కామ్రెడ్` చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



