'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ కే 'ఎఫ్-3'!
on Jan 29, 2022
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ఎఫ్3'. 2019 సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన ఎఫ్-2 కు సీక్వెల్ గా ఈ సినిమా వస్తోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయింది.
"మా షూటింగ్ జర్నీ పూర్తి అయింది. మీ నవ్వుల జర్నీ మొదలవుద్ది. వస్తే, కొద్దిగా ముందుకి.. వెళ్ళినా కొద్దిగా వెనక్కి.. థియేటర్స్ కి రావడం మాత్రం పక్కా" అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపిన మూవీ టీమ్ ఓ వీడియోని షేర్ చేసింది. ఆ వీడియో నటీనటులతో కలిసి డైరెక్టర్ అనిల్ రావిపూడి కనిపించారు. అలాగే సినిమా ఏప్రిల్ 28 న విడుదల కానున్నట్లు వీడియోలో తెలిపారు.
'ఆర్ఆర్ఆర్' మూవీ మార్చి 18 లేదా ఏప్రిల్ 28 న విడుదల అవుతుందని ఇటీవల మేకర్స్ ప్రకటించారు. ఒకవేళ ఆర్ఆర్ఆర్ ఏప్రిల్ 28 కి విడుదలైతే ఎఫ్-3 విడుదల తేదీ మారే అవకాశముంది.
Also Read