తారక్ - బుచ్చిబాబు సినిమాలో జాన్వి!?
on Jan 29, 2022
`ఉప్పెన` వంటి సంచలన చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగేశాడు బుచ్చిబాబు సానా. గురువు సుకుమార్ బాటలోనే మొదటి సినిమాతోనే పరిశ్రమ దృష్టిని విశేషంగా ఆకర్షించాడు.
Also Read: విజయ్-పూరి కాంబోలో మరో మూవీ.. హీరోయిన్ గా జాన్వీ కపూర్!
కట్ చేస్తే.. త్వరలో తన ద్వితీయ చిత్రాన్ని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోతో చేయబోతున్నాడు బుచ్చిబాబు సానా. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ విజయనగరం నేపథ్యంలో సాగుతుందని బజ్. అంతేకాదు.. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు కట్టనున్నాడని వినిపిస్తోంది.
Also Read: ఫస్ట్ తారక్.. నెక్స్ట్ బన్నీ.. ఆపై బాలయ్య!?
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో తారక్ కి జోడీగా అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానున్నది. కాగా, మరోవైపు `లైగర్` తరువాత డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రానున్న సెకండ్ జాయింట్ వెంచర్ లోనూ జాన్వీ నటించే అవకాశముందని అంటున్నారు. మొత్తమ్మీద.. బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాన్వి.. తెలుగులోనూ తనదైన ముద్ర వేయబోతోందన్నమాట.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
