ఆకట్టుకుంటున్న ఆ రెండు చిత్రాలు..!
on May 23, 2017

భారతీయ చిత్ర సీమను ఒక కుదుపు కుదిపేసి అంచనాలను మించి రికార్డులను తిరగరాసిన బహుబలి -2 చిత్రం విడుదల తరువాత వరసగా వచ్చిన చిత్రాలన్నీ పేరుకులేకుండా పోతాయని అనే టాక్ టాలీవుడ్ లో మొదలైంది.కానీ అందుకు విరుద్ధంగా పాజిటివ్ టాక్ తో..మంచి కలెక్షన్ లతో దూసుకువెళ్తున్న చిత్రాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.వేణు మడికంటి తెరకెక్కించిన 'వెంకటాపురం' తనదైన శైలి లో అభిమానులను ఆకట్టుకుంటూ దూసుకెళ్తుంది.ఈ చిత్రం లో రాహుల్ ,మహిమా మఖ్వాన్ లు హీరో హీరోయిన్లు గా నటించారు.చిన్న చిత్రంగా విడుదలై వసూళ్లనూ రాబట్టుకుంటుంది.ఇక నిఖిల్ కథానాయకుడిగా వచ్చిన 'కేశవ'చిత్రం అత్యధిక ఆదరణ పొందుతూ వసూళ్లను చేజిక్కించుకుంటుంది.వైవిధ్యమైన కథ తో వచ్చిన చిత్రం గా నిలిచింది. సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి సంగీతాన్ని సన్నీ.ఎంఆర్ అందించారు.మర్డర్ అయినా ప్రశాంతంగా చేస్తాడు అనే తీరుతో విపరీతం గా... భారీ స్పందనతో తన ప్రతిభను ప్రదర్శిస్తుంది. విభిన్నమైన ఆలోచనలతో దర్శకులు తమ ప్రతిభను చాటుకున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



