చలపతి రావు వ్యాఖ్యలు... నాగార్జున తిప్పలు...
on May 23, 2017
అక్కినేని కుటుంబం అంటే తెలుగు సినీ పరిశ్రమలో మంచి గౌరవం. పెద్దాయన అక్కినేని నాగేశ్వర్ రావు కాలం నుండి ఇప్పటి నాగ చైతన్య, అఖిల్ వరకు ఎవరు కూడా నోరు జారిన సందర్భం లేదు. అలాంటిది బయటి వారి వ్యాఖ్యలు అక్కినేని కుటుంబంని ఇబ్బందుల పాలు చేస్తుంది. నాగ చైతన్య నటించిన రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో చలపతి రావు అసభ్యకరమైన, అభ్యంతరకరమైన... ఇంకా చెప్పాలి అంటే జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసారు. యాంకర్ అడిగిన ఒక ప్రశ్నకి సమాధానమిస్తూ, అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారు అని తన సొంత కుటుంబ సభ్యులే చీదరించుకునే రేంజ్ కామెంట్స్ చేసారు. కొంత నిశ్శబ్దం తర్వాత, నాగార్జున మొత్తానికి ఈ విషయం పై నోరు మెదిపారు.
తాను ఎల్లవేళలా వ్యక్తిగతంగా కానీ సినిమాల్లో కానీ అమ్మాయిలకి గౌరవం ఇస్తానని, చలపతి రావు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు అభ్యంతకరంకలిగించేలా ఉన్నాయి అని చెప్పుకొచ్చారు. రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో జరిగిన సంఘటన చలపతి రావు కి పెద్దగా ఇబ్బంది కలిగించకపోయినా, అక్కినేని కుటుంబానికి మాత్రం తిప్పలు తెచ్చిపెట్టింది. నాగార్జున ఈ సంఘటనపై వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటి నుండి, చలపతి రావు ని పబ్లిక్ ఫంక్షన్లకి పిలవాలంటే దర్శక, నిర్మాతలు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. అంతేనా, అసలు ఆహ్వానం కూడా ఇవ్వక పోవచ్చు. మరి, ఇంత నాటుగా మాట్లాడితే చెడేది ఎవరికి!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
