జై బాలయ్య.. బ్లాక్ బస్టర్ లోడింగ్!
on Nov 23, 2022
2023 సంక్రాంతికి నటసింహం నందమూరి బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ హంట్ టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చింది.
'వీర సింహా రెడ్డి' చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా నుంచి 'జై బాలయ్య' అంటూ సాగే పాటను నవంబర్ 25న ఉదయం 10.29కి విడుదల చేయబోతున్నట్టు తెలుపుతూ తాజాగా మేకర్స్ ఒక పోస్టర్ ను వదిలారు. అందులో వైట్ అండ్ వైట్ ధరించి ట్రాక్టర్ నడుపుతున్న బాలయ్య లుక్ కిర్రాక్ ఉంది. మరి సాంగ్ కూడా అదే రేంజ్ లో ఉంటుందేమో చూడాలి.
బాలయ్య గత చిత్రం 'అఖండ'కు కూడా థమనే సంగీతం అందించడం విశేషం. అందులో కూడా 'జై బాలయ్య' అనే సాంగ్ ఉంది. ఆ సాంగ్, సినిమా రెండూ బ్లాక్ బస్టర్ అయ్యాయి. అదే సెంటిమెంట్ 'వీర సింహా రెడ్డి'కి కూడా రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
