'గుంటూరు కారం'కి పోటీగా రౌడీ హీరో మూవీ!
on Jul 16, 2023

వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వార్ కోసం ఇప్పటికే 'ప్రాజెక్ట్ k', 'గుంటూరు కారం', 'హనుమాన్', 'ఈగల్' సినిమాలు కర్చీఫ్ వేశాయి. అయితే వీటిలో 'ప్రాజెక్ట్ k' సంక్రాంతి రేస్ నుంచి తప్పుకొని, వేసవికి వాయిదా పడనుంది అంటున్నారు. అదే జరిగితే సంక్రాంతి బరిలో బిగ్ స్టార్ సినిమాగా మహేష్ బాబు నటిస్తున్న 'గుంటూరు కారం' ఒక్కటే మిగుతుంది. అయినప్పటికీ 'హనుమాన్', 'ఈగల్' సినిమాల రూపంలో గట్టి పోటీనే ఎదురయ్యే అవకాశముంది. అయితే ఇప్పుడు ఈ సంక్రాంతి పోరుని మరింత రసవత్తరంగా మార్చడానికి కొత్తగా మరో సినిమా ఎంట్రీ ఇచ్చింది.
'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ మరోసారి చేతులు కలిపిన సంగతి తెలిసిందే. విజయ్ కెరీర్ లో 13వ రూపొందుతోన్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది. తాజాగా మూవీ షూటింగ్ ప్రారంభమైందని చెప్పిన మేకర్స్, ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించి సర్ ప్రైజ్ చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



