చిక్కుల్లో జయలలిత 'తలైవి' బయోపిక్
on Nov 28, 2019

మూలిగే నక్క మీద తాటికాయ పడటం అంటే ఇదేనేమో! అసలే ఓ పక్క వెల్లువలా వస్తున్న విమర్శలకు సమాధానం ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతున్న దర్శకుడు ఏఎల్ విజయ్, నిర్మాతలు శైలేష్ ఆర్. సింగ్, విష్ణు ఇందూరికి పరిస్థితులు చూస్తుంటే మరో ఎదురుదెబ్బ తగిలేట్టు ఉంది.
జయలలితగా కంగనా రనౌత్ నటిస్తున్న సినిమా 'తలైవి'. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ ఇటీవల విడుదలయ్యాయి. జయలలితగా కంగన ఏమాత్రం సూట్ అవ్వలేదని తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. విమర్శకులపై కంగనా రనౌత్ సోదరి విరుచుకుపడుతోంది. ఆమెకు భయపడి విమర్శించే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా! విమర్శలను వినీ విననట్టు వదిలేయవచ్చు. కానీ, చట్టపరంగా కోర్టుల నుండి వచ్చే నోటీసులను పట్టించుకోకుండా వదిలేయడానికి వీల్లేదు.
తమిళనాట జయలలితపై మూడు నాలుగు బయోపిక్స్ తెరకెక్కుతున్నాయి. 'తలైవి' ఒకటి అయితే... జయలలితగా నిత్యామీనన్ నటించనున్న 'ది ఐరన్ లేడీ' మరొకటి. గౌతమ్ మీనన్ తెరకెక్కించనున్న వెబ్ సిరీస్ ఒకటి. వీటికి వ్యతిరేకంగా జయలలిత మేనకోడలు దీప కోర్టులో పిటీషన్ వేశారు. జయలలిత జీవితంపై చట్టపరంగా ఎవరికీ హక్కులు లేవని, బయోపిక్స్ తీసేవాళ్ళు తనకు స్క్రిప్ట్ వినిపించి తన అనుమతి తీసుకోవాలనేది దీప వాదన. లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని అంటున్నారు. ఆమెకు అనుకూలంగా మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. నిత్యా మీనన్ నటించే సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. కంగనా రనౌత్ 'తలైవి'పై సివిల్ సూట్ వేయడానికి దీప సిద్ధమవుతున్నారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



