బాలకృష్ణ నిర్మాతకు టెన్షన్ లేదు
on Nov 28, 2019
.jpg)
క్రిస్మస్ సందర్భంగా వస్తున్న సినిమాల్లో 'రూలర్' ఒకటి. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కె.యస్. రవికుమార్ దర్శకత్వంలో 'జై సింహా' తర్వాత తెరకెక్కుతోన్న చిత్రమిది. 'జై సింహా'ను నిర్మించిన సి. కల్యాణ్ ఈ సినిమానూ నిర్మిస్తున్నారు. ఇప్పుడీ సినిమాతో ఆయనకు రిలీజ్ టెన్షన్స్ లేవు. కొన్ని రోజుల క్రితం ప్రకటించినట్టు డిసెంబర్ 20వ తేదీకి సినిమాను హ్యాపీగా విడుదల చేసుకోవచ్చు. ఎందుకంటే... ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. ఆల్రెడీ డబ్బింగ్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. విడుదలకు ఇంకా 20 రోజుల టైమ్ ఉంది కనుక... ఈజీగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో... నిర్మాత ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ విడుదలైన టీజర్ నందమూరి అభిమానుల్లో సినిమాపై అంచనాలు పెంచింది. బాలకృష్ణను అభిమానులు ఏ విధంగా చూడాలని కోరుకుంటారో... ఆ విధంగా చూపించారు దర్శకుడు కె.యస్. రవికుమార్. పోలీస్ ఆఫీసర్ గా బాలకృష్ణ అభినయం మాస్ ను ఆకట్టుకుంది. క్లాస్ గెటప్ ప్రేక్షకులు అందరికీ సర్‌ప్రైజ్ అని చెప్పాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



