త్రివిక్రమ్‌కి ఓ బకరా కావలెను!
on Jun 26, 2015
.jpg)
సన్నాఫ్ సత్యమూర్తి తరవాత త్రివిక్రమ్ సైలెంట్ అయిపోయాడు. ఆయన నుంచి సినిమా `కబురు` ఏమీ వినపడలేదు. అయితే ఆయన సైలెంట్‌గా తన స్ర్కిప్టు వర్కు ముగించేశారని ఇప్పుడు ఓ హీరో కోసం అన్వేషిస్తున్నారని వినికిడి. త్రివిక్రమ్ ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తారని కొద్ది రోజుల క్రితం వార్తలొచ్చాయి. ఆ సినిమాలో సమంత నటిస్తుందని చెప్పుకొన్నారు. అయితే సమంత మాత్రం `అలాంటిదేం లేదు` అని క్లారిటీ ఇచ్చేసింది. కాకపోతే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. త్రివిక్రమ్ ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నాడన్నది మాత్రం రూఢీ అయిపోయింది. అయితే ఈ సినిమాలో `హీరో` పాత్రకూ తగిన ప్రాధాన్యం ఉంది. అంటే హీరో ఉండీ లేనట్టు ఉండి... హీరోయిన్ పాత్రని ఎలివేట్ చేస్తారన్నమాట. అందుకే త్రివిక్రమ్ ఓ హీరో కోసం అన్వేషిస్తున్నాడని వినికిడి.
మరీ టాప్ స్టార్ పొజీషన్‌లో ఉన్న కథానాయకులెవ్వరూ ఈ పాత్ర చేయడానికి సాహసించరట. అందుకే మీడియం రేంజు హీరోలతో సర్దుబాటు చేయాలని చూస్తున్నాడు. సునీల్, అల్లరి నరేష్, రామ్... ఈ టైపన్నమాట. వాళ్లెవ్వరూ క్యారెక్టర్ చూసి ముందుకు రాకపోయినా - త్రివిక్రమ్ బ్రాండ్ ఇమేజ్ చూసైనా ముందుకొస్తారని.. ఆశ. అందుకే తనకు అందుబాటులో ఉన్న హీరోల్ని ఒకొక్కరినీ పిలిచి మాట్లాడాలని ఫిక్సయ్యాడట త్రివిక్రమ్. మరి బకారా లాంటి హీరో క్యారెక్టర్‌కి ఎవరు సై అంటారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



