సగం సినిమా రీషూటా??
on Jun 26, 2015
.jpg)
స్ర్కిప్టు రూపంలో ఉన్న కథ తెరపై సినిమాగా మలిచేలోగా ఎన్నో మార్పులు సంతరించుకొంటుంది. సినిమా షూటింగ్ ముగిశాక... మార్పులు చేర్పులూ తప్పని సరి. అవసరమైతే రెండు మూడు సీన్లు రీషూట్ కూడా చేస్తారు. అయితే.. ఓ సినిమా విషయంలో అలాకాదు. ఏకంగా సగం సినిమా రీషూట్ చేశారట. ఆ సినిమానే `టైగర్`. సందీప్‌కిషన్, రాహుల్ రవీంద్రన్ కథానాయకులుగా నటించిన చిత్రమిది. 75 శాతం సినిమా పూర్తయ్యాక.. కొంతమంది సినీ ప్రముఖులకు `టైగర్` చూపించారట. వాళ్లంతా తలో మార్పు చెప్పేసరికి.. టీమ్ రిపేర్లకు దిగి. ఏకంగా సగం సినిమాని రీషూట్ చేశారని తెలుస్తోంది. అంతేకాదు.. ఈసినిమా కోసం సందీప్ కిషన్ మూడు నెలలు కష్టపడి మరీ సిక్స్ ప్యాక్ చేశాడు. ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ని సందీప్‌పై తెరకెక్కించారు. ఆ ఫైట్ కూడా మార్పులూ, చేర్పుల కార్యక్రమంలో ఎగిరిపోయిందట. అలా సందీప్ కిషన్ మూడు నెలల శ్రమ వృథా అయిపోయింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



