రాజు, సైన్యాధిపతి ఆయనే.. డబ్బుతో కొనలేరు
on Aug 12, 2025

స్టార్ డైరెక్టర్ 'త్రివిక్రమ్'(Trivikram)2024 సంక్రాంతికి 'సూపర్ స్టార్ మహేష్ బాబు'(Mahesh Babu)తో 'గుంటూరుకారం'(Guntur Kaaram)ని తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)తో మైథలాజికల్(Mythological)మూవీని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి. ఇటీవల జరిగిన వార్ 2(War 2)ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరై, ఎన్టీఆర్ అంటే తనకి ఎంత అభిమానమో తన స్పీచ్ ద్వారా తెలియచేసాడు.
త్రివిక్రమ్ రీసెంట్ గా 'పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి'(R Narayanamurthy)స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'యూనివర్సిటీ పేపర్ లీక్'(University paper leak) చిత్రాన్ని నారాయణమూర్తితో కలిసి వీక్షించడం జరిగింది. అనంతరం త్రివిక్రమ్ మాట్లాడుతు యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా నిడివి చూసి ముందు భయపడ్డాను. కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేగంగా సాగింది. ఇలాంటి చిత్రాలు మనల్ని వెంటనే ఉత్తేజపరచవు. కానీ నారాయణమూర్తి గారు పట్టువదలకుండా నడిపించారు. ఆయన చిత్రాల్లో నారాయణమూర్తి గారే రాజు,సైన్యాధిపతి . తన ప్రతి సినిమాలోను ఏదో ఒక ప్రయోజనం ఉండాలనుకుంటారు. అణిచివేతకి గురైన వాళ్ళ తరుపున నారాయణమూర్తి ఒక గొంతుక. అలాంటి వ్యక్తి ఉండాలి. లేదంటే సమాజంలో ఏకపక్ష ధోరణి ఉంటుంది. నా సినిమాలో ఒక క్యారక్టర్ కి నారాయణమూర్తి గారిని అనుకున్నాను. పారితోషకంతో ఆయన్ని కొనలేమని తెలిసిందని త్రివిక్రమ్ చెప్పుకొచ్చాడు.
'యూనివర్సిటీ పేపర్ లీక్' చిత్రం విషయానికి వస్తే..తమ భవిష్యత్తు బాగుండాలని విద్యార్థులు రేయింపగళ్లు ఎన్నో ఇబ్బందులని, ఆర్ధిక ఇబ్బందులని సైతం ఎదుర్కొని, పరీక్షలకి ప్రీపేర్ అవుతున్నారు. కానీ కొంత మంది స్వార్ధపరులు ఎగ్జామ్స్ పేపర్స్ ని లీక్ చేసి, విద్యార్థుల జీవితాలని ఏ విధంగా నాశనం చేస్తున్నారనే పాయింట్ తో 'యూనివర్సిటీ పేపర్ లీక్' చిత్రం తెరకెక్కింది. ఆగస్టు 22 రిలీజ్ డేట్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



