బ్రేకప్ బాధలు... షాక్లో త్రిష!
on Dec 25, 2018
రానా, త్రిష డేటింగులో వున్నారనేది పాత న్యూస్! కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి ఇంట జరిగిన ఓ పెళ్లికి ఇద్దరూ జంటగా వచ్చారు. అప్పట్లో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని వార్తలొచ్చాయి. అయితే... తాము ప్రేమలో వున్నామని ఇటు రానా గానీ, అటు త్రిష గానీ ఎప్పుడూ మీడియా ముందు చెప్పలేదు. తరవాత తమిళ నిర్మాత వరుణ్ మణియణ్తో త్రిష ఎంగేజ్మెంట్ జరిగింది. తరవాత అదీ రద్దయ్యింది. అప్పట్నుంచి రానా, త్రిష డైటింగ్, ఎఫైర్ వార్తలు రావడం మానేశాయి. తరవాత ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలలో త్రిష తనకు స్నేహితురాలు మాత్రమేనని రానా చెప్పుకొచ్చాడు. అయితే.. తాజాగా 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో త్రిషతో కొన్నేళ్లు డేటింగ్ చేసిన మాట నిజమేనని అంగీకరించాడు. రానా చెప్పిన మాటల ప్రకారం... త్రిషతో ఎప్పుడో బ్రేకప్ జరిగింది. కానీ, ఇప్పుడు బయట పెట్టాడు. ఇదే త్రిషకు చిక్కులు తెచ్చిపెట్టింది.
కంటిన్యూగా త్రిష ఫోన్ రింగ్ అవుతూనే వుంది. ఫోన్ చేసిన వారందరూ 'రానా అలా ఎందుకు చెప్పాడు?' అని త్రిషను అడుగుతున్నారట. ఇద్దరి సంగతి తెలిసిన వాళ్ళు ఓ రకంగా స్పందిస్తే... తెలియనివాళ్ళు 'రానా చెప్పింది నిజమేనా?' అని అడుగుతున్నారట. అసలు... రానా అలా చెబుతాడని త్రిష అసలు ఊహించలేదట. డేటింగ్ గురించి నేషనల్ టీవీలో బయటపెట్టడంతో త్రిష షాక్లో వుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.