థాయ్ ల్యాండ్ లో త్రిష షికార్లు!
on Jul 5, 2016
వరుస హారర్ సినిమాలు చేస్తూ త్రిషకు బాగా బోర్ కొట్టినట్లుంది. అందుకే సేద తీరడానికి థాయ్ ల్యాండ్ పయనమైంది. అయితే.. సరదాకి కాదులెండి.. తన తాజా సినిమా "మోహిని" షూటింగ్ కోసమే. తమిళంలో తెరకెక్కుతున్న ఈ హారర్ సినిమా ద్వారా మాదేష్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇటీవల చెన్నై లో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకొన్న "మోహిని"లో త్రిష దెయ్యంగా కనిపిస్తుందనుకోన్నారందరూ. అయితే.. ఈ సినిమాలో "మోహిని"గా టైటిల్ పాత్ర పోషిస్తున్నది త్రిషే అయినప్పటికీ.. దెయ్యం పాత్రలో కనిపిస్తున్నది వేరే అమ్మాయి అని, ఆ పాత్రలో ఓ యువ కథానాయకి కనిపించనుందని సమాచారం!