Home

»

Latest News

క్రియేటివ్ డిఫ‌రెన్సెస్‌తో చిరంజీవి సినిమా నుంచి త‌ప్ప‌కుంటున్నా!

Mar 13, 2020 6:54PM

 

 ఇప్పుడు మ‌హేశ్‌తో 'అత‌డు', 'సైనికుడు' సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించిన త్రిష సైతం క్రియేటివ్ డిఫ‌రెన్సెస్‌తో ఒక సినిమా నుంచి త‌ప్ప‌కుంది. అది అల్లాట‌ప్పా సినిమా కాదు.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొర‌టాల శివ రూపొందిస్తోన్న 'ఆచార్య'. ఈ వార‌మే ఆమె 'ఆచార్య' సినిమా సెట్స్ మీద‌కు వ‌స్తున్న‌ద‌నీ, చిరంజీవి కాంబినేష‌న్‌లో సీన్స్ చేయ‌నున్న‌ద‌నీ వార్త‌లు వ‌చ్చిన టైమ్‌లో క్రియేటివ్ డిఫ‌రెన్సెస్‌తో ఆ సినిమా నుంచి త‌ప్పుకుంటున్నానంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా శుక్ర‌వారం ఆమె ప్ర‌క‌టించ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య చ‌కితుల్ని చేసింది.

"కొన్నేసి సార్లు మొద‌ట చెప్పిన దానికీ, డిస్క‌స్ చేసుకున్న దానికీ భిన్నంగా విష‌యాలు మార‌తాయి. క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ (సృజ‌నాత్మ‌క భేదాలు) వ‌ల్ల చిరంజీవి గారి ఫిల్మ్‌లో భాగం కాకూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నా. ఆ మూవీ టీమ్‌కు శుభాకాంక్ష‌లు. ఒక ఆస‌క్తిక‌ర సినిమాతో త్వ‌ర‌లో నా ప్రియ‌మైన తెలుగు ప్రేక్ష‌కుల‌ను చూస్తాన‌ని ఆశిస్తున్నా" అని పోస్ట్ చేసింది త్రిష‌. క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ అనే మాట ఆమె ఉప‌యోగించ‌డాన్ని బ‌ట్టి డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తోటే ఆమెకు అభిప్రాయ భేదాలు వ‌చ్చి ఉంటాయ‌ని భావిస్తున్నారు. పైగా మొద‌ట చెప్పిన‌దానికి, మాట్లాడుకున్న‌దానికి భిన్నంగా ఇప్పుడు విష‌యాలు మారిపోయాయ‌ని కూడా ఆమె చెప్పింది. మొద‌ట ఏం మాట్లాడుకున్నారో, ఇప్పుడు ఏం మారిపోయిందో.. ఆమెకూ, ఆచార్య ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కూ మాత్ర‌మే తెలుసు. ఏదేమైనా చిరంజీవి సినిమా నుంచి త‌ప్ప‌కుంటున్నాన‌ని త్రిష ప్ర‌క‌టించ‌డం మాత్రం యూనిట్‌కు మింగుడు ప‌డ‌ని విష‌యం. ఆమె స్థానంలో కొర‌టాల శివ‌ ఎవ‌ర్ని తీసుకుంటాడో చూడాలి.

త్రిష చేసిన ట్వీట్‌

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com