మోస్ట్ పాపులర్ ఓటీటీ యాక్టర్స్ లిస్ట్ లో సమంత.. ఎన్నో స్థానమంటే?
on Dec 30, 2021

'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ తో సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఓటీటీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో 'రాజీ'గా అదరగొట్టిన సమంత నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు బాలీవుడ్ నుండి పలు ఆఫర్లు సైతం వస్తున్నాయి. ఒక్క సిరీస్ తోనే ఇంత ప్రభావం చూపిన సమంత.. తాజాగా ఓటీటీలో మోస్ట్ పాపులర్ యాక్టర్స్ లిస్ట్ లో నాలుగో స్థానం దక్కించుకుని సంచలనం సృష్టించింది.
ఇండియాలో మోస్ట్ పాపులర్ ఓటీటీ యాక్టర్స్ లిస్ట్ ను ఒర్మాక్స్ మీడియా తాజాగా విడుదల చేసింది. సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు గాను విడుదల చేసిన ఈ లిస్ట్ లో సమంత టాప్ 5 లో స్థానం దక్కించుకుంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో మెప్పించిన మనోజ్ బాజ్ పాయ్ మొదటి స్థానంలో నిలవగా.. రెండో స్థానంలో మనోజ్ త్రిపాఠి, మూడో స్థానంలో నవాజుద్దీన్ సిద్ధిఖి నిలిచారు. ఇక సమంత నాలుగో స్థానంలో నిలవగా.. రాధిక ఆప్టే, కెకె మీనన్, సైఫ్ ఆలీఖాన్, సుస్మితా సేన్, జితేంద్ర కుమార్ , తమన్నా ఆ తర్వాతి స్థానాలు దక్కించుకున్నారు.

ఇప్పటికే సమంత రాజీ పాత్రకు గాను ఉత్తమ నటిగా ఓటీటీ ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది. ఇప్పుడు ఓటీటీలో మోస్ట్ పాపులర్ యాక్టర్స్ లిస్ట్ లో నాలుగో స్థానంలో నిలిచింది. ఒక్క సిరీస్ తో ఇంతటి సంచలనం సృష్టించిన సమంతపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



