తొలిప్రేమ ఒక్క మాటలో... టీజర్ రివ్యూ
on Dec 20, 2017
మన జీవితంలోకి ఎంత మంది అమ్మాయిలు వచ్చి వెళ్లినా, మనం ఫస్ట్ ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికీ మరిచిపోలేం, ఇది వరుణ్ తేజ్ సినిమా తొలిప్రేమ టీజర్ లోని డైలాగ్. బీచ్ లో విషాదవదనంతో నడుస్తూ వరుణ్ ఈ డైలాగ్ చెబుతాడు. అసలు ఈ ఒక్క మాటతో తొలి ప్రేమకి అసలయిన అర్ధాన్ని అర్ధవంతంగా చెప్పాడు దర్శకుడు వెంకీ అట్లూరి. తొలిప్రేమా... నీ గుండెలో గాయమా... తొలిప్రేమా... నా వల్లే అనకుమా... అంటూ వచ్చే నేపథ్య సంగీతం బానే ఉంది. చివర్లో పెరిగిన గడ్డంతో కనిపించి తీక్షణంగా ఒక చూపు చూసిన వరుణ్ తేజ్ భలే హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ఎ జర్నీ అఫ్ లవ్ అనేది తొలి ప్రేమ సినిమాకి ఉప శీర్షిక.
బాబాయ్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా టైటిల్ తీసుకొని ఒకింత సాహసం చేస్తున్న వరుణ్ తేజ్, తొలిప్రేమ భవితవ్యం విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. ఫిదా తో ఫస్ట్ కమర్షియల్ హిట్ కొట్టిన వరుణ్ తేజ్, తోలిప్రేమ తో యూత్ హీరో అనిపించుకునే పనిలో ఉన్నాడు. వరుణ్ తేజ్ సరసన రాశి ఖన్నా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 9 న ప్రేక్షకుల ముందుకి రానుంది.