ఎన్టీఆర్ సగం పేరును కొట్టేసిన పవన్..?
on Dec 20, 2017
టైటిల్ చూసి మీరు ఏదేదో ఊహించేసుకోండి.. ఒక్కసారి మేము చెప్పింది విని ఆ తర్వాత ఒక ఐడియాకి రండి. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, త్రివిక్రమ్ కాంభినేషన్లో వస్తున్న మూవీ అజ్ఞాతవాసి. పవర్‌స్టార్ కెరీర్లో 25వ సినిమా కావడంతో పాటు.. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు, పాటలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో అజ్ఞాతవాసి కోసం.. అభిమానులతో పాటు మొత్తం టాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ప్రతి సినిమా రిలీజ్‌కు ముందు ఆ మూవీ కథ అందులోని పాత్రలకు సంబంధించిన విషయాలు బయటకు వస్తుంటాయి. అవి నిజం కావొచ్చు.. లేదంటే పుకారు రాయుళ్లు పుట్టించిన గాసిప్స్ కావొచ్చు. కానీ ఫ్యాన్స్‌కు మాత్రం పండగే.
ఇప్పుడు అజ్ఞాతవాసి విషయంలోనూ అదే జరుగుతోంది. ఈ మూవీకి సంబంధించిన కొన్ని డైలాగ్స్ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో ఒక దానిలో అభిజిత్ అనే పేరు వినిపిస్తుంది. ఇది విన్నవారు అజ్ఞాతవాసిలో పవన్ పేరు అభిజిత్ అని ఫిక్సయి.. ఈ న్యూస్‌ను తెలిసిన వారందరికీ షేర్ చేస్తున్నారట. అయితే కొందరు వేరే హీరో ఫ్యాన్స్ మాత్రం.. మా హీరో పేరును మీరు కొట్టేశారని అంటున్నారట. సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమాలో జూనియర్ క్యారెక్టర్ పేరు అభిరామ్.. దీంతో మా హీరో పేరులోని సగం కొట్టేశారని పవన్ ఫ్యాన్స్‌తో సరదాగా అంటున్నారట. సో.. అదన్నమాట అసలు మ్యాటర్.