హిందీలో రామ్ 'ది వారియర్'కి సూపర్ రెస్పాన్స్!
on Nov 29, 2022

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని సినిమాలు హిందీలో డబ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటూ ఉంటాయి. హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా ఆయన నటించిన ఎన్నో సినిమాల హిందీ వెర్షన్లు యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ దక్కించుకుంటాయి. ప్రస్తుతం 'ది వారియర్' సైతం అదే బాటలో పయనిస్తోంది.
రామ్ సూపర్ హిట్ ఫిల్మ్ 'నేను శైలజ' హిందీ వెర్షన్ కి యూట్యూబ్ లో 500 మిలియన్ కి పైగా వ్యూస్ రాగా.. 'హలో గురు ప్రేమకోసమే' 500 మిలియన్ కి చేరువలో ఉంది. 250 మిలియన్ కి పైగా వ్యూస్ తో 'ఉన్నది ఒకటే జిందగీ', 100 మిలియన్ కి పైగా వ్యూస్ తో 'హైపర్', 'గణేష్' సత్తా చాటాయి. 'పండగ చేస్కో' 100 మిలియన్ కి చేరువలో ఉంది. ఇక ఇప్పుడు 'ది వారియర్' సైతం రికార్డు వ్యూస్ తో దూసుకుపోతోంది.
వారం క్రితం 'ది వారియర్' హిందీ వెర్షన్ ని యూట్యూబ్ లో విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. వారం రోజుల్లోనే 50 మిలియన్ కి పైగా వ్యూస్ తో సత్తా చాటింది. రామ్ యాక్షన్, సినిమా సూపర్ అంటూ నార్త్ ఆడియన్స్ కామెంట్స్ చేస్తుండటం విశేషం. చూస్తుంటే త్వరలోనే 100 మిలియన్ మార్క్ అందుకునేలా ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



