'థాంక్యూ' టీజర్.. 'ప్రియా నేను రెడీ' అంటున్న నాగ చైతన్య
on May 23, 2022
'మనం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అక్కినేని హీరో నాగ చైతన్య, టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'థాంక్యూ'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో రాశి ఖన్నా హీరోయిన్. ఈ సినిమా జూలై 8న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేసింది మూవీ టీమ్. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ రాగా.. ఇప్పుడు టీజర్ కి ముహూర్తం ఖరారైంది.
'థాంక్యూ' టీజర్ ని మే 27న సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ ఒక వీడియో ద్వారా కాస్త కొత్తగా ప్రకటించారు మేకర్స్. ఆ వీడియోలో నాగ చైతన్య డబ్బింగ్ స్టూడియోలో డబ్బింగ్ చెబుతూ కనిపించాడు. "ప్రియా నేను రెడీ.. ఏ పనైనా వెంటనే స్టార్ట్ చేయాలి" అంటూ చైతన్య డబ్బింగ్ చెబుతుండగా.. ఒకరు వీడియో తీస్తుంటారు. దీంతో అక్కడే స్టూడియోలో ఉన్న డైరెక్టర్ విక్రమ్ తో "ఏం జరుగుతుంది" అని చైతన్య అడగగా.. "థాంక్యూ టీజర్ వస్తుంది" అని విక్రమ్ చెబుతాడు. దాంతో సర్ ప్రైజ్ అయిన చైతన్య "ఎప్పుడు?" అని అడగటంతో స్క్రీన్ మీద డేట్ పడుతుంది. అయితే ఈ వీడియోని బట్టి చూస్తే ఈ మూవీలో హీరోయిన్ పేరు ప్రియ అని తెలుస్తుంది. విక్రమ్ దర్శకత్వంలో వచ్చిన దాదాపు అన్ని సినిమాల్లోనూ హీరోయిన్ పేరు ప్రియనే ఉంది. ఇప్పుడు 'థాంక్యూ'కి కూడా అదే సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నాడని అర్థమవుతోంది.
ఇదిలాఉంటే ఈ రోజు ఉదయం నుంచి గడ్డంతో ఉన్న చైతన్య ఫోటో ఒకటి ట్విట్టర్ లో వైరల్ గా మారింది. 'థాంక్యూ'లో లుక్ అంటూ ఆ ఫోటోని షేర్ చేస్తూ అక్కినేని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్న వేళ టీజర్ అప్డేట్ రావడంతో వారి ఆనందం రెట్టింపైంది. 'మజిలీ', 'వెంకీ మామ', 'లవ్ స్టోరీ', 'బంగార్రాజు' వంటి సినిమాలతో వరుస విజయాలు అందుకున్న చైతన్య.. 'మనం' దర్శకుడితో చేస్తున్న సినిమా కావడంతో 'థాంక్యూ'పై మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ అంచనాలను అందుకొని 'థాంక్యూ' చైతన్యకు మరో విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.
Also Read