Home

»

Latest News

ఉత్కంఠ‌భ‌రితంగా '9 అవర్స్' వెబ్ సిరీస్ ట్రైలర్

May 23, 2022 6:05PM

 

ప్రముఖ దర్శకుడు క్రిష్.. షో రన్నర్ గా వ్యవహరిస్తున్న వెబ్ సిరీస్ '9 అవర్స్'. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఓటీటీ ఈ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను స్ట్రీమింగ్‌కు తీసుకొస్తోంది. తారకరత్న, అజయ్, వినోద్ కుమార్, మధుశాలినీ, రవి వర్మ, ప్రీతి అస్రానీ, బెన‌ర్జీ, స‌మీర్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రాజీవ్ రెడ్డి వై., సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌కు నిరంజన్ కౌషిక్, జాకబ్ వర్గీస్ దర్శకత్వం వహించారు. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ జూన్ 2వ‌ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను హీరో వరుణ్ తేజ్ విడుదల చేశారు.

ముగ్గురు దొంగలు మూడు బ్యాంకులను దోచుకోవడంతో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. రెండు బ్యాంకుల్లో దోపిడీ చేసి పరారైన దొంగలు, కోఠీ బ్యాంక్ లో మాత్రం అమాయకులను బందీలుగా పట్టుకుంటారు. తమ డిమాండ్స్ నెరవేర్చకుంటే ఒక్కొక్కరిని చంపేస్తుంటామంటూ హెచ్చ‌రించి, ఆ ప‌ని మొద‌లుపెట్టేస్తారు. ఈ దోపిడీ కేసును పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ తారకరత్న డీల్ చేస్తుంటాడు. పోలీసులకు, దొంగలకు జరిగిన ఈ యుద్ధంలో గెలుపెవరిది అనేది ఉత్కంఠను రేపుతోంది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటంతో వెబ్ సిరీస్ పై అంచనాలు పెరుగుతున్నాయి.

మ‌నోజ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా, శ‌క్తికాంత్ కార్తీక్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేసిన '9 అవర్స్' సిరీస్ తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లోనూ అందుబాటులోకి వ‌స్తోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com