'థాంక్యూ' ట్రైలర్.. స్వేచ్ఛగా వదిలేయగలిగే ప్రేమ ఎంతో గొప్పది
on Jul 12, 2022

లవ్ స్టోరీలకు అక్కినేని హీరోలు పెట్టింది పేరు. అక్కినేని యువ హీరో నాగ చైతన్య కూడా 'ఏ మాయ చేశావె', '100% లవ్', 'ప్రేమమ్', 'లవ్ స్టోరి' వంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'థాంక్యూ'. అక్కినేని ఫ్యామిలీకి 'మనం' వంటి క్లాసిక్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.
"మనం ఎక్కడ మొదలయ్యామో మర్చిపోతే.. మనం చేరిన గమ్యానికి విలువ ఉండదు" అంటూ చైతన్య చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. నారాయణపురం అనే గ్రామానికి చెందిన హీరో అంచెలంచెలుగా ఎదిగి చాలా పెద్ద స్థాయికి వెళ్తాడు. తన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, తను జీవితంలో ఎదగడానికి కారణమైన వారికి థాంక్యూ చెప్పడం కోసం హీరో సాగించే ప్రయాణం అన్నట్లుగా ట్రైలర్ ఉంది. రాశి ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ ఇలా ఒక్కో ఏజ్ లో ఒక్కక్కరిని చైతన్య ఇష్టపడినట్లుగా ట్రైలర్ లో చూపించారు. బ్యూటిఫుల్ విజువల్స్, మ్యూజిక్ తో ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. "ఒక మనిషిని పట్టుకొని వేలాడే ప్రేమ కంటే.. స్వేచ్ఛగా వదిలేయగలిగే ప్రేమ ఎంతో గొప్పది" డైలాగ్ ఆకట్టుకుంటోంది.

థమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి బీవీఎస్ రవి కథ అందించాడు. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పీసీ శ్రీరామ్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



