'కోబ్రా' ఈవెంట్ లో విక్రమ్.. గుండెపోటు న్యూస్ క్రియేటర్స్ కి థాంక్స్!
on Jul 12, 2022

ఛాతిలో ఇబ్బందిగా అనిపించడంతో కోలీవుడ్ స్టార్ విక్రమ్ ఇటీవల ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆస్పత్రిలో చేరిన సమయంలో ఆయనకు గుండెపోటు అంటూ పలువురు తప్పుడు వార్తలను ప్రచారం చేశారు. దాంతో ఆయన అభిమానులు ఆందోళన చెందారు. అయితే అవన్నీ తప్పుడు వార్తలని వైద్యులు చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా ఈ ఘటనపై విక్రమ్ స్పందించారు.
విక్రమ్ హీరోగా నటించిన 'కోబ్రా' మూవీ ఆగష్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా చెన్నైలో నిర్వహించిన ఈ మూవీ ఆడియో వేడుకలో విక్రమ్ సందడి చేశారు. ఆయన ఎప్పటిలాగే ఈ వేడుకలో ఉత్సాహంగా కనిపించడం విశేషం. ఈ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ తప్పుడు న్యూస్ స్ప్రెడ్ చేసిన వారికి చురకలు అంటించారు. "జబ్బుపడిన వారి ఫోటోలకు నా తలను పెట్టి మార్ఫ్ చేసి, థంబ్ నెయిల్స్ పెట్టారు. వాళ్ళ క్రియేటివిటీ బాగుంది. థాంక్స్. ఇలాంటివి జీవితంలో ఎన్నో అనుభవించాను. ఇవి నాకు ఆందోళన కలిగించలేదు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫ్యాన్స్ నాకు అండగా ఉన్నారు. ఇంతకుమించి నాకేం వద్దు" అంటూ విక్రమ్ మాట్లాడారు.
అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన కోబ్రా సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



