'థాంక్యూ' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. మూడో రోజు మరీ దారుణం!
on Jul 25, 2022

'మజిలీ', 'వెంకీ మామ', 'లవ్ స్టోరి', 'బంగార్రాజు' ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న అక్కినేని యువ హీరో నాగ చైతన్యకు 'థాంక్యూ' రూపంలో భారీ షాక్ తగిలింది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే సరికి ఈ మూవీ చైతన్య గత చిత్రాల ఫస్ట్ డే కలెక్షన్స్ లో సగం కూడా రాబట్టలేకపోయింది. దారుణమైన ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ దిశగా పయనిస్తోంది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం వరల్డ్ వైడ్ గా రూ.24 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన థాంక్యూ.. మొదటి రోజు రూ.2.16 కోట్లు, రెండో రోజు 94 లక్షలు, మూడో రోజు 50 లక్షల షేర్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి వీకెండ్ లో 3.60 కోట్ల షేర్ రాబట్టిన ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కి ఇంకా 21 కోట్ల దూరంలో ఉంది. ఫస్ట్ డే నుంచే ఈ సినిమాకి దారుణమైన కలెక్షన్స్ వస్తున్నాయి. చైతన్య గత చిత్రాలు ఫస్ట్ డే 7-8 కోట్లకు పైగా షేర్ రాబట్టగా.. థాంక్యూ అందులో 30 శాతం కూడా వసూలు చేయలేకపోయింది. పలు చోట్ల ప్రేక్షకులు లేక నెగటివ్ షేర్స్ వస్తున్నట్లు టాక్. ఈ మూవీ ఫుల్ రన్ లో మహా అయితే 5 కోట్ల షేర్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. అదే జరిగితే బయ్యర్లు 19-20 కోట్లు నష్టపోనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల బిజినెస్ చేసిన థాంక్యూ మొదటి వీకెండ్ పూర్తయ్యే సరికి 2.75 కోట్ల షేర్ మాత్రమే రాబట్టగిలిగింది. మొదటి రోజు 1.65 కోట్లు, రెండో రోజు 70 లక్షలు, మూడో రోజు 40 లక్షలుగా కలెక్షన్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా నైజాంలో 1.15 కోట్లు(బిజినెస్ 8 కోట్లు), సీడెడ్ లో 32 లక్షలు(బిజినెస్ 2.50 కోట్లు), ఆంధ్రాలో 1.28 కోట్లు(బిజినెస్ 9.50 కోట్లు) వసూలు చేసింది. కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియా 11 లక్షలు(బిజినెస్ 1.50 కోట్లు), ఓవర్సీస్ 74 లక్షలు(బిజినెస్ 2.50 కోట్లు) రాబట్టిందని అంచనా.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



