చావుని ఎదుర్కునే వాళ్ళకి మాత్రమే జీవితం ఉంటుంది
on Jul 11, 2024

కొన్ని సినిమాలు షూటింగ్ దశ నుంచే ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీ ని కలగ చేస్తాయి. ఈ మధ్య కాలంలో ఆ తరహా చిత్రాలు చాలా అరుదుగా తెరకెక్కుతున్నాయి. అలాంటి అరుదైన ఒక చిత్రమే తంగలాన్. చియాన్ విక్రమ్(vikram)హీరోగా వస్తున్న ఈ చిత్రం కోసం పాన్ ఇండియా పేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో నిన్న విడుదలైన ట్రైలర్ తంగలాన్(thangalaan)మీద మరింత ఆసక్తిని పెంచుతుంది.
పీరియాడిక్ యాక్షన్ జోనర్ లో తంగలాన్ తెరకెక్కింది. రెండు నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ ని చూస్తుంటే ఒళ్ళు ఒక్కసారిగా గగుర్పాటుకి గురవుతుంది. విక్రమ్ వేషధారణ, హావ భావాలు చూస్తుంటే చియాన్ మరో సారి ప్రేక్షకులని తన నటనతో మెస్మరైజ్ చెయ్యడం ఖాయమని అనిపిస్తుంది.మిగతా వాళ్ళ గెటప్స్ కూడా చాలా కొత్తగా ఉంది. బ్రిటిష్ పరిపాలనా కాలంలో కర్ణాటకలో జరిగిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపధ్యంలో మూవీ తెరకెక్కింది, బంగారాన్ని వెలికి తీయడం కోసం బ్రిటీష్ అధికారులు అక్కడే ఉండే కొంత మంది గిరిజనుల్ని పనిలో కుదుర్చుకుంటారు.అందులోని ఒక తెగకి విక్రమ్ నాయకుడు గా కనిపించబోతున్నాడు. ఆ తర్వాత గిరిజనుల్లోనే రెండు వర్గాలు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో వచ్చిన పోరాట సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి. యాక్షన్ సీక్వెన్స్ ఒక రేంజ్ లో ఉండబోతున్నాయని ట్రైలర్ లో క్లియర్ గా అర్ధమవుతుంది. ఇక చివర్లో ఇక్కడ చావుని ఎదుర్కునే వాళ్ళకి మాత్రమే జీవితం అంటూ విక్రమ్ చెప్పడంతో మూవీ రేంజ్ ఏమిటో అందరకి ఆర్డమయింది.

అలాగే ప్రముఖ హీరోయిన్ మాళవిక మోహన్ ఒక అతీంద్రియ శక్తులున్న క్యారక్టర్ లో మెరవబోతుంది. ఇక పార్వతి తీరు వోతు కూడా ఒక ముఖ్య పాత్రలో చేసింది. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా(Gnanavel Raja)నిర్మాత కాగా పా రంజిత్(pa ranjith)దర్శకుడు. కబాలి, కాలా , సార పట్టా వంటి సూపర్ బ్లాక్ బస్టర్స్ పా రంజిత్ దర్శకత్వంలో వచ్చాయి. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించాడు.ట్రైలర్ విడుదల తో అయితే పాన్ ఇండియా ప్రేక్షకులు అందరు ఇప్పుడు తంగలాన్ గురించే మాట్లాడుకుంటున్నారు. మూవీ కూడా ఆ రేంజ్ లోనే అగస్ట్ 15 న విడుదల కాబోతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



