మూడు రోజుల్లో తండేల్ అరుదైన రికార్డు..అక్కినేని ఫ్యాన్స్ లో జోష్
on Feb 10, 2025

ఈ నెల 7 న వరల్డ్ వైడ్ గా విడుదలైన యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)సాయిపల్లవి(Sai Pallavi)ల 'తండేల్'(Thandel)మంచి ప్రేక్షాదరణతో ముందుకు దూసుపోతుంది.ఏపిలోని శ్రీకాకుళం జిల్లాకి చెందిన కొంత మంది మత్యకారుల జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కగా,చందు మొండేటి(Chandu Mondeti)దర్శకత్వ ప్రతిభతో పాటు చైతు,సాయి పల్లవి మధ్య లవ్ కెమిస్ట్రీ,దేవిశ్రీప్రసాద్(Devisriprasad)సంగీతం,గీతా ఆర్ట్స్ నిర్మాణ విలువలు సినిమా విజయానికి ప్రధాన కారణంగా నిలిచాయని,ట్రేడ్ వర్గాలు వారు అభిప్రాయపడుతున్నారు.
ఇందుకు నిదర్శనంగా ఈ మూవీ మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా,62.47 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.ప్రస్తుతం మూవీకి ఉన్న పాజిటివ్ టాక్ దృష్ట్యా త్వరలోనే వంద కోట్ల క్లబ్ లోకి కూడా త్వరగానే చేరే అవకాశం ఉందని అంటున్నారు.ఇక ఇప్పుడు ఈ కలెక్షన్లు అయితే అక్కినేని ఫ్యాన్స్ లో మంచి జోష్ ని తీసుకొస్తున్నాయి.గత కొంత కాలంగా అక్కినేని కుటుంబానికి చెందిన హీరోల సినిమాలు ప్రేక్షకులపై పెద్దగా ప్రభావాన్ని చూపించలేదు.అలాంటిది 'తండేల్' మూడు రోజుల్లోనే 62 కోట్ల దాకా రాబట్టి అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చిందని చెప్పవచ్చు.

ఇక 'తండేల్'ని ఏపి కి చెందిన ఒక ఆర్ టి సి బస్ లో ప్రదర్శించడంపై నిర్మాతల్లో ఒకరైన బన్నీ వాసు(Bunny Vasu)ఆర్ టి సి చైర్మన్ నారాయణ కి ఫిర్యాదు చెయ్యడంతో పాటు,నిందుతులపై కఠిన చర్యలు కూడా తీసుకోవాలని కూడా కోరాడు.లోకల్ టీవీ లో కూడా గేమ్ చేంజర్ తరహాలో తండేల్ ప్రదర్శితమయ్యింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



