హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తమన్ !!
on Jun 18, 2013

క్రికెట్ పరిభాషలో అయితే దీన్ని "ఫాస్టెట్ హాఫ్ సెంచరీ" అనొచ్చు. కేవలం అయిదు సంవత్సరాల సమయంలో యాభై చిత్రాల మైలురాయిని చేరుకోవడమంటే మామూలు విషయం కాదు. కానీ తమన్ ఆ ఘనతను సొంతం చేసుకున్నాడు.
శంకర్ దర్శకత్వంలో వచ్చిన "బోయ్స్" చిత్రంలో నటుడిగా పరిచయమైన తమన్.. ఆ తర్వాత "కిక్" చిత్రంతో సంగీత దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక అప్పటినుంచి వరుసగా తెలుగు, తమిళ సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు.
ఒకవైపు స్టార్ హీరోల సినిమాలకు సంగీతాన్నందిస్తూనే.. మరోవైపు చిన్న హీరోల చిత్రాలకూ బాణీలు సమకూరుస్తున్న తమన్.. తాజాగా "శ్రీనువైట్ల_మహేష్‌బాబు" కాంబినేషన్‌లో వస్తున్న "ఆగడు" చిత్రానికి సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రమే తమన్ యాభైయ్యవ చిత్రంగా నిలవనుంది.
అయితే.. "క్వాంటిటీ కన్నా.. క్వాలిటీ మిన్న" అని నమ్మే మన తెలుగు పరిశ్రమలో తమన్ మరికొంత కాలం సంగీత దర్శకుడిగా నిలదొక్కుకోవాలంటే... తన మూస ధోరణి నుంచి బయటకు వచ్చి.. కొత్త తరహా సంగీతాన్ని అందించాల్సిందే!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



