మళ్ళీ ఎంట్రీ ఇస్తున్న రాశి
on Jun 18, 2013
అగ్ర హీరోలందరితో నటించిన అందాల తార రాశి. చాలా రోజులు సినిమాలకు దూరంగా ఉండి, టి.వి. షో లలో చేస్తున్నా రాశి, మళ్ళీ సినిమాల్లోకి వచ్చేసింది. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓ చిత్రంలో రాశి, రాజేంద్రప్రసాద్ లు బార్యభర్తలుగా నటిస్తుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అన్ని చిత్రాలు మంచి విజయం సాధించాయి. మరి ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. మరి ఈ చిత్రం విడుదలై రాశికి మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుందాం.