'రెడ్' హిందీ రీమేక్‌కి శ్రీదేవి సినిమా టైటిల్!
on Oct 8, 2020

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన తాజా సినిమా 'రెడ్'. తెలుగులో 'బ్రూస్ లీ', 'సాహో' చిత్రాల్లో ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన అరుణ్ విజయ్ గుర్తున్నాడు కదా! అతడు హీరోగా నటించిన తమిళ సినిమా 'తడమ్'కి రీమేక్ ఇది. హిందీలోనూ రీమేక్ చేస్తున్నారు. అక్కడ సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించనున్నాడు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... ఆ సినిమాకి టైటిల్ ఖరారు చేశారు.
'రెడ్' హిందీ రీమేక్ కి 'గుమరాహ్' టైటిల్ ఖరారు చేసినట్టు హిందీ చిత్రసీమ వర్గాల సమాచారం. 90వ దశకంలో శ్రీదేవి సంజయ్ దత్ జంటగా నటించిన సినిమా టైటిల్ ఇది. కథ ప్రకారం ఆ టైటిల్ అయితే బాగుంటుందని ఖరారు చేశారట. త్వరలో చిత్రాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తెలుగులో రామ్ సరసన మాళవిక శర్మ కథానాయికగా నటించారు. హిందీ లో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించనున్నారు. జెర్సీ రీమేక్ లో కూడా షాహిద్ కపూర్ సరసన ఆమె నటిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



