సినీ కార్మికుల వేతనాల పెంపు
on Sep 16, 2022

జులై 1,2022 నుండి జూన్ 30,2025 వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వేతనాలు, విధివిధానాలను తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.
"తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో వాణిజ్య మండలి అధ్యక్షులు K. బసిరెడ్డి, గౌరవ కార్యదర్శి K.L. దామోదర్ ప్రసాద్, ప్రొడ్యూసర్స్ సెక్టార్ కౌన్సిల్ చైర్మన్ యేలూరు సురేందర్ రెడ్డి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు C.కళ్యాణ్, గౌరవ కార్యదర్శి T. ప్రసన్న కుమార్, తెలంగాణ స్టేట్ చలన చిత్ర వాణిజ్య మండలి గౌరవ కార్యదర్శి కె. అనుపమ్ రెడ్డి, ఇతర కమిటీ సభ్యులు మరియు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్, జనరల్ సెక్రటరీ P.S.N. దొర, కోశాధికారి సురేష్ లు పాల్గొన్న సమావేశములులో వేతనములు, విధివిధానములు అన్నియు ఖరారయ్యాయి. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి 2018 సంవత్సరములో చేసిన ఒప్పందంను అనుసరించి ఆ వేతనముల మీద పెద్ద సినిమాలకు 30%, చిన్న సినిమాలకు 15% పెంచేందుకు అంగీకరించడమైనది. ఈ పెంచిన వేతనములు 01-07-2022 వ తేదీ నుండి 30-06-2025 వరకు అమలులో ఉంటాయి. అలాగే ఏది చిన్న సినిమా అనేది చలన చిత్ర వాణిజ్య మండలి మరియు ఎంప్లాయిస్ ఫెడరేషన్ లతో కూడిన కమిటీ నిర్ణయిస్తుంది." అంటూ తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



