రష్యాలో పుష్ప రాజ్.. తగ్గేదేలే!
on Nov 30, 2022
తెలుగు సినిమాలు దేశవ్యాప్తంగా మాత్రమే కాదు విదేశాల్లోనూ సత్తా చాటుతున్నాయి. ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్' జపాన్ లో సంచలన కలెక్షన్స్ తో ఆల్ టైం రికార్డు దిశగా దూసుకుపోతుండగా.. ఇప్పుడు 'పుష్ప:ది రైజ్' రష్యాలో సత్తా చాటడానికి సిద్ధమవుతోంది.
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప:ది రైజ్' గతేడాది డిసెంబర్ లో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఏకంగా ఏడాది తర్వాత ఈ డిసెంబర్ 8న రష్యాలో విడుదలవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బన్నీ, సుకుమార్, రష్మిక రష్యా వెళ్లారు. అక్కడ వారికి ఘన స్వాగతం లభించింది. డిసెంబర్ 1న మాస్కోలో, డిసెంబర్ 3న సెయింట్ పీటర్స్ బర్గ్ లో ప్రదర్శించే స్పెషల్ ప్రీమియర్లకు వారు హాజరుకానున్నారు. రష్యాలో డిసెంబర్ 8న విడుదలవుతున్న ఈ చిత్రం అక్కడ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
బన్నీ, సుకుమార్, రష్మిక రష్యా నుంచి తిరిగి వచ్చాక 'పుష్ప-2'(పుష్ప: ది రూల్) షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.
Also Read